Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బిబిసి డాక్యుమెంటరీని కేరళ కాంగ్రెస్ విభాగం గురువారం ప్రదర్శించింది. రాజధాని తిరువనంతపురంలోని షణ్‌గుముగామ్ బీచ్ వద్ద భారీ తెరపై ఈ డాక్యుమెంటరీని కాంగ్రెస్ నాయకులు ప్రదర్శించారు. భారీ సంఖ్యలో ప్రజలు దీనిని తిలకించారు. గుజరాత్ 2002 అలర్లకు మోడీదే ప్రధాన బాధ్యత అని పేర్కొంటూ బిబిసి రెండు భాగాలుగా డాక్యుమెంటరీని ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండో భాగం బుధవారమే బిబిసి లండన్ ద్వారా ప్రసారమైంది. ఈ డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించింది.
ప్రచారం కోసమే ఈ డాక్యుమెంటరీని బిబిసి రూపొందించిందని కేంద్రం ఆరోపించింది. రాహుల్‌గాంధీ జమ్ములో మాట్లాడుతూ కేంద్రం సెన్సార్‌షిప్‌ను ప్రశ్నించారు. 'సత్యం అత్యంత వెలుగుతో ప్రకాశిస్తుంది. సత్యానికి ఎప్పటికైనా బయటకు వచ్చే అలవాటు ఉంది. కాబట్టి ఎన్ని నిషేథాలు విధించినా, అణచివేత చర్యలు చేపట్టినా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా.. సత్యాన్ని బయటకు రాకుండా ఆపలేరు' అని రాహుల్ గాంధీ అన్నారు.