Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాయపూర్ : తమ రాష్ట్రంలోని యువతకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి నిరుద్యోగ భృతిని ఇవ్వనున్నట్లు ఛత్తీస్గడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ప్రకటించారు.బస్తర్ జిల్లా జగదల్పూర్లోని లాల్బాగ్ పరేడ్ మైదానంలో గురువారం గణతంత్రదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రతి నెల నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని చెప్పిన ఆయన ఎంత మొత్తాన్ని ఇస్తారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు హామి ఇచ్చినప్పటికీ వివిధ కారణాల రీత్యా అమలుకు నోచుకోలేదు.
తాజాగా ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం గమనార్హం. నిరుద్యోగ భృతితో పాటు కార్మికులకు గృహ నిర్మాణ పథకం, మహిళలు, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు కాపాడేందుకు ప్రత్యేక పథకాలను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.