Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఇడికి పరిమితమైన అధికారాలు మాత్రమే ఉన్నాయని, ఇడి అధికారాలు అపరిమితమేమీ కాదని కోర్టు గుర్తుచేసింది. మనీలాండరింగ్ కేసులను మాత్రమే ఇడి విచారించాలని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రతీదాంట్లో ఇడి జోక్యం తగదని పేర్కొంది. సెక్షన్ 3 నేరాలను మాత్రమే పరిశోధించడానికి పిఎంఎల్ ఇడి అధికారం ఇచ్చిందని, ప్రతి దాంట్లో ఇడి జోక్యం తగదని ఢిల్లీ హైకోర్టు హితవు పలికింది. విచారణ సందర్భంగా వేరే నేరాలు వెలుగులోకి వస్తే వాటిని సంబంధిత దర్యాప్తు సంస్థలు మాత్రమే విచారించాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది. ఛత్తీస్‌గడ్‌లోని కోల్‌బ్లాక్‌ల కేటాయింపునకు సంబంధించిన కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును వెల్లడించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.