Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్‌వ్యాక్సిన్ 'ఇన్‌కొవాక్'ను కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్షుఖ్ మాండవియా, శాస్త్ర- సాంకేతికత శాఖ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం విడుదల చేశారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ ఇన్‌కొవాక్ ప్రపంచంలోనే మొట్టమొదటి ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్. రెండు విడతలుగానూ, తరువాత బూస్టర్ డోసుగా ఇవ్వడానికి ఈ వ్యాక్సిన్‌కు 2022 డిసెంబరులో ప్రభుత్వ అనుమతి లభించింది. అయితే 18 ఏళ్లు దాటిన వారికే ఈ వ్యాక్సిన్ ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్‌ను వినియోగించడకూడదని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సిఒ) షరతులు విధించింది. రెండు డోసులుగా ఇచ్చే ఈ వ్యాక్సిన్ మధ్య విరామం 28 రోజులు ఉండాలని పేర్కొంది. ఈ వ్యాక్సిన్ అపాయింట్‌మెంట్ కోసం కోవిన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని భారత్ బయోటెక్ తెలిపింది. అయితే ఇప్పటికే రెండు డోసులు, బూస్టర్ డోసు తీసుకున్న వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వబడదు. ఈ వ్యాక్సిన్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒకొక్క డోసుకు రూ.800 ధర నిర్ణయించినట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది.