Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగో వంతు విలువ పతనం
- రూ.4 లక్షల కోట్లు ఫట్
- మార్కెట్లపై తీవ్ర ఒత్తిడి
న్యూఢిల్లీ : అదానీ గ్రూపు కంపెనీలు మోసపూరిత చర్యలతో స్టాక్స్ విలువను పెంచుకుంటాన్నా యని.. తప్పుడు ఎకౌంట్స్‌కు పాల్పడు తున్నాయని.. మనీ లాండరింగ్ చేస్తు న్నాయని అమెరికన్ సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్టు దెబ్బ అదానీ షేర్లకు పెను గాయాన్ని చేశాయి. ఆ రిపోర్ట్ ప్రభావంతో నాలుగోవంతు విలువ కోల్పోయాయి. రెండు సెషన్ల లో అదానీకి చెందిన 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాపిటలైజేషన్ రూ.4 లక్షల కోట్లు ఆవిరయ్యింది. హిండెన్‌బర్గ్ రిపోర్టుతో బుధవారం ఒక్క సెషన్‌లోనే రూ.1 లక్షల కోట్ల విలువను కోల్పోగా.. శుక్రవారం సెషన్‌లో దాదాపు రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. ఇంట్రాడేలో ఈ సూచీలు 5-25 శాతం క్షీణించాయి. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ నిరాధారమైందని.. ఆ సంస్థపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటా మని అదానీ గ్రూపు ప్రకటించిన ప్పటికీ.. ఇన్వెస్టర్లు విశ్వసించలేక పోయారు. మరోవైపు అదానీ గ్రూపు అవకతవకలపై తాము ఏ విచారణకు అయినా సిద్దమని.. తమ రిపోర్టుకు కట్టుబడి ఉన్నామని హిండెన్‌బర్గ్ ప్రకటించడం అదానీ షేర్లను మరింత ఒత్తిడికి గురి చేసింది. జనవరి 24న అదానీ గ్రూపు కంపెనీల మార్కెట్ కాపిటలైజేషన్ విలువ రూ19 లక్షల కోట్లుగా ఉండగా.. జనవరి 27 ముగింపు నాటికి రూ.15 లక్షల కోట్లకు పరిమితమయ్యింది. అదానీ షేర్లలో అమ్మకాల వల్ల ఎల్‌ఐసి దాదా పు రూ.18వేల కోట్ల నష్టాన్ని చవి చూసింది. అదానీ గ్రూపులోని కంపెనీ ల్లో జనవరి 24 నాటికి ఎల్‌ఐసి పెట్టు బడి రూ.81,268 కోట్లుగా ఉండగా.. 27 నాటికి ఇది రూ.62,621 కోట్లకు పడిపోయింది. అదానీ గ్రూపు అవకతవకలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్‌ను అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడిదారుడు బిల్ అక్‌మాన్ సమర్థించారు. ''ఆ రిపోర్ట్ అత్యంత విశ్వసనీయమైనది, చాలా లోతుగా పరిశోధించబడిందని'' అక్‌మాన్ శుక్రవారం ట్వీట్ చేశారు.
ఎఫ్‌పిఒపై నీలినీడలు
అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ. 20,000 కోట్ల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పిఒ) శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో పెట్టుబడులకు బుధవారం యాంకర్ ఇన్వెస్టర్లను స్పందన రాగా.. శుక్రవారం రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి అనాసక్తి వ్యక్తమయ్యిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఎఫ్‌పిఒ జనవరి 31 వరకు కొనసాగనుంది. ఎఫ్‌పిఒలో ఒక్కో షేరును రూ.3,112 - రూ.3,276 ధరల శ్రేణిలో విక్ర యించనున్నారు. తాజా ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం షేరు ధర ఎఫ్‌పిఒ ధర కంటే కిందకు చేరి రూ.2,768 వద్ద నమోదవుతోంది. దీంతో ఈ ఎఫ్‌పిఒ ఫ్లాప్ కానుందని అంచనాలు వెలుపడుతున్నాయి.
కుబేరుల్లో ఏడో స్థానానికి అదానీ..
హిండెన్‌బర్గ్ రిపోర్ట్ దెబ్బకు అత్యంత కుబేరుడైనా గౌతం అదానీ సంపద కీలకమైన 100 బిలియన్ల మార్క్‌కు దిగువకు పడిపోయింది. రెండు రోజుల్లో ఆయన కంపెనీల షేర్ల పతనంతో ప్రపంచ సంపన్నుల జాబితాలో అదానీ ర్యాంకింగ్ ఏడో స్థానానికి పడిపోయింది. ఇంతక్రితం ఆయన నాలుగో స్థానంలో ఉన్నారు. కొన్ని నెలల క్రితం ఓ దశలో రెండో స్థానానికి ఎగబాకగా.. చాలా కాలం మూడో స్థానంలో కొనసాగారు.
రెండు సెషన్లలో అదానీ షేర్ల పతన తీరు
అదానీ ఎంటర్‌ప్రైజెస్ -19.77%
అదానీ పోర్ట్స్ - 21.58%
అదానీ విల్మర్ -9.74%
అదానీ గ్రీన్ -22.46%
అదానీ పవర్ -9.72%
అదానీ ట్రాన్స్‌మీషన్ -27.08%
అదానీ టోటల్ -24.76%
ఎసిసి -19.52%
అంబూజా సిమెంట్ -23.75%