Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్ :భద్రతా వైఫల్యం కారణంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడోయాత్రకు శుక్రవారం ఆటంకం ఏర్పడింది. షెడ్యూల్ ప్రకారం.. ¸ కాశ్మీర్ లోయలో నేడు 11 కి.మీ జోడోయాత్ర చేపట్టాల్సి వుంది. అయితే భద్రతా కారణాల రీత్యా కిలో మీటరు తర్వాత పాదయాత్రను నిలిపివేయాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రాహుల్ పాదయాత్ర జమ్ము నుంచి కాశ్మీర్‌లోకి ప్రవేశిస్తుండగా.. ఊహించని విధంగా కాశ్మీర్‌లో భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారని... దీంతో యాత్రను నిలిపివేసినట్టు ఆ వర్గాలు తెలిపాయి. జమ్ముకాశ్మీర్ పాలనా యంత్రాంగం భద్రతా సిబ్బందిని ఆకస్మికంగా ఉపసంహరించుకుందనీ, ఇది తీవ్రమైన భద్రతా ఉల్లంఘన అని కాంగ్రెస్ మండిపడింది. శ్రీనగర్‌కు వెళ్లే మార్గంలో బనిహాల్ టన్నెల్ దాటిన తర్వాత భారీ జన సమూహం ఎదురవడం, తగినంత భద్రతా సిబ్బంది లేకపోవడంతో యాత్రను రద్దు చేయాల్సి వచ్చిందని తెలిపింది. వెంటనే ఆయనను ప్రత్యేక వాహనంలో వెనక్కు తీసుకెళ్లాల్సి వచ్చినట్టు పేర్కొంది. బనిహాల్ టన్నెల్ దాటిన అనంతరం పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారని కాంగ్రెస్ నేత కె.సి వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి భారత్ జోడోయాత్రలో జమ్ముకాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కూడా పాల్గొన్నారు.