Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువత కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో
- కుప్పంలో నారా లోకేష్ పాదయాత్ర
తిరుపతి : 'యువగళం... మన గళం. అదే ప్రజాబలం. నట సార్వభౌముడు ఎన్‌టిఆర్ తెలుగుజాతి కోసం చైతన్యరథమెక్కారు. ఆంధ్రా ప్రజల కోసం 'వస్తున్నా మీకోసం' అంటూ నారా చంద్రబాబునాయుడు పాదయాత్ర చేపట్టారు. యువత కోసం యువగళం పేరుతో నేను పాదయాత్ర తొలి అడుగు వేశాను. అని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్ని అడ్డుకులు సృష్టించినా యువగళం యాత్రగానీ, పవన్ కల్యాణ్ చేపట్టనున్న వారాహి యాత్రగానీ ఆగదని తేల్చి చెప్పారు. జిఒ-1 బూచిచూపి యువగళం యాత్రకు అడ్డు తగిలితే తొక్కుకుంటూపోతామని హెచ్చరించారు. టిడిపి అధికారంలోస్తే యువత కోసం ప్రత్యేక ప్యాకేజీ అమలు చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నుంచి యువగళం పాదయాత్రను శుక్రవారం ఆయన ప్రారంభించారు. తన తండ్రి చంద్రబాబునాయుడు నియోజకవర్గమైన కుప్పంలోని లక్ష్మీపురం వరదరాజగుడి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి ముహూర్తం ప్రకారం శుక్రవారం ఉదయం 11.03 గంటలకు పాదయాత్ర తొలి అడుగు వేశారు. ఈ యాత్ర 400 రోజులపాటు నాలుగు వేల కిలోమీటర్లు సాగనుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. తొలిరోజు లకీëపురం నుంచి ప్రారంభమైన పాదయాత్ర పట్టణంలోని పిఇఎస్ మెడికల్ కళాశాల వరకూ ఎనిమిది కిలోమీటర్లు సాగింది. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మామ నందమూరి బాలకృష్ణ, బావ నందమూరి తారకరత్న, మాజీ మంత్రులు అమరనాథరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కళా వెంకట్రావు, కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబు తదితరుల సారథ్యంలో ఈ యాత్ర ప్రారంభమైంది. ఎన్‌టిఆర్‌కు, అంబేద్కర్ విగ్రహాలకు లోకేష్ పూలమాలలు వేశారు.