Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'పరీక్షా పే చర్చ'లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలపై విశ్వాసం ఉంచాలని ప్రధాని మోడీ విద్యార్థులకు సూచించారు. ఎలక్ట్రానిక్ పరికరాల (గాడ్జెట్స్) కన్నా మీరు సమర్థవంతులని.. వాటిని తెలివిగా, స్మార్ట్‌గా వినియోగించాలని అన్నారు. శుక్రవారం నిర్వహిం చిన ''పరీక్షా పే చర్చ'' కార్యక్రమంలో ప్రధాని మోడీ విద్యార్థులతో మాట్లా డారు. భారతదేశంలోని ప్రజలు సగటున ఆరుగంటలపాటు ఎలక్ట్రానిక్ పరికరాలను చూస్తున్నారని.. ఇది ఆందోళనకరమైన అంశమని అన్నారు. సగటున ఆరుగంటల పాటు గాడ్జెట్స్ వినియోగం తయారీ దారులకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఇది ప్రజల సృజనాత్మకతను అడ్డుకుంటుందని అన్నారు. పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడటం, చీటింగ్ చేయడం వంటి వాటి గురించి కూడా ప్రస్తావించారు. కాలం మారు తున్నదని... అడుగడుగునా పరీక్షలను రాయాల్సివుంటుందని, చీటింగ్‌తో ఒకటి రెండు పరీక్షల్లో విజయం సాధించవచ్చు కానీ, జీవితంలో ఎప్పటికీ ఉత్తీర్ణత సాధించలేరని అన్నారు. విద్యార్థులు తమ సామర్థ్యాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని చెప్పారు. ప్రతి ఒక్కరిలోనూ నైపుణ్యాలు ఉంటాయని... వాటిగురించి తెలుసుకోవాలని అన్నారు.