Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నితీష్‌కుమార్ సన్నిహితునితో చర్చలు
పాట్నా : బీహార్‌లో బిజెపి ఆపరేషన్ కమలం ప్రారంభించింది. నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని కూల్చివేసే దిశగా బిజెపి పావులు కదుపుతోంది. జెడియు నేత, పార్లమెంటరీ బోర్డ్ చైర్మన్ ఉపేంద్ర కుష్వాహాతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఉపేంద్ర కుష్వాహాను బిజెపి నేతలు శుక్రవారం కలిశారు. బిజెపి నేతలు ప్రేమ్ రంజన్ పటేల్, సంజరు టైగర్, యోగేంద్ర పాశ్వాన్‌లు పరామర్శిస్తున్న ఫోటో బీహార్ వ్యాప్తంగా వైరల్ గా మారింది. కుష్వాహాను బిజెపిలోకి ఆహ్మానిస్తామని బిజెపి అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ సింగ్ ప్రకటించారు. దీంతో ఉపేంద్ర కుష్వాహా జెడియును వీడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ కోరారు. అయితే తండ్రి ఆస్తిలో వాటా లేకుండా తాను పార్టీని వీడలేనని కుష్వాహా ఘాటుగా సమాధానమిచ్చారు. ''బాగా చెప్పారు భారు.. అన్నయ్యల సలహా మేరకు తమ్ముళ్లంతా ఇళ్లలోంచి వెళ్లిపోతే..తమ్ముళ్లను బయటకు నెట్టేసి అన్నయ్యలు మొత్తం ఆస్తినంతా దోచుకుంటారా'' అని మండిపడ్డారు. ''ఆస్తిలో నా వాటాను వదిలి పెట్టి నేను ఎలా బయటికి వెళతాను'' అని కుష్వాహా హిందీలో ట్వీట్ చేశారు. గతంలో జెడియులో తిరిగి చేరడానికి కుష్వాహా తన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీని(ఆర్‌ఎల్‌ఎస్పీ)ని రెండేళ్ల క్రితం జెడియులో విలీనం చేసిన సంగతి తెలిసిందే. కుష్వాహా బిజెపిలో చేరకున్నా.. ఓ కొత్త పార్టీని స్థాపించి ఎన్‌డిఎలో చేరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.