Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ భారత్ జోడోయాత్ర సోమవారంతో ముగింపు దశకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా జనవరి 30న శ్రీనగర్‌లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి 12 ప్రతిపక్ష పార్టీలు హాజరుకానున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి 21 పార్టీలను ఆహ్వానించామని, అయితే భద్రతాకారణాల రీత్యా కొందరు హాజరుకావడం లేదని ఆ వర్గాలు వెల్లడించాయి. సీపీఐ(ఎం), సీపీఐలతో పాటు డీఎంకే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ, జేడీయూ, శివసేన, వీసీకే, కేరళ కాంగ్రెస్, ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని జమ్ముకాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ), షిబు సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) శ్రీనగర్‌లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. టీఎంసీ, సమాజ్‌వాది పార్టీ, టీడీపీ పార్టీలు ఈ కార్యక్రమానికి దూరంగాఉన్నాయి. భద్రతా వైఫల్యంతో శుక్రవారం రద్దైన యాత్ర శనివారం అవంతిపొరాలోని చెర్సూగ్రామం నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముప్తీలు పాల్గొన్నారు. గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుండి జోడోయాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. సుమారు 145 రోజుల్లో 3,970 కి.మీ, 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ యాత్ర సాగింది. తెలంగాణ నుంచి రేవంత్‌రెడ్డి, సీతక్క, శామల కిరణ్‌రెడ్డి, ఎంఎల్ఏలు, ఎంపీలు శ్రీనగర్ చేరుకున్నారు. రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు.