Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్తాన్‌లో 14 మంది విద్యార్థుల సస్పెన్షన్
- ఏబీవీపీ ఒత్తిడితో సెంట్రల్ వర్సిటీ చర్యలు
జైపూర్ : ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని వీక్షించిన 11 మంది విద్యార్థులపై రాజస్తాన్ సెంట్రల్ యూనివర్సిటీ వేటు వేసింది. బీజేపీకి చెందిన విద్యార్థి విభాగం ఏబీవీపీ 24 మంది విద్యార్థుల జాబితాను విడుదలచేసి.. వారిపై చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీని డిమాండ్ చేసినట్టు తెలుస్తున్నది. దీంతో శుక్రవారం నుంచి 14 రోజుల పాటు విద్యార్థులను యూనివర్సిటీ, హాస్టల్ నుంచి సస్పెండ్ చేసింది. ఏబీవీపీ విద్యార్థుల ఒత్తిడితోనే యాజమాన్యం వేటువేసినట్టు పీజీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏబీవీపీ కార్యకర్తలు క్యాంపస్‌లో గురువారం ఉద్రిక్తతలను సృష్టించారని, జైశ్రీరామ్, దేశ ఉగ్రవాదులను కాల్చి పారేయండి అని నినాదాలు చేశారని పీజీ విద్యార్థులు తెలిపారు. విద్యార్థులు తమ మొబైల్ ఫోన్‌లలోనే ఆ వీడియోను వీక్షించారనీ.. ఎక్కడా ప్రదర్శించలేదని చెప్పారు. సస్పెన్షన్‌కు గురైన విద్యార్థుల హాస్టల్ గదుల్లోకి బలవంతంగా ప్రవేశించి విద్యార్థులను బెదిరించారని తెలిపారు.