Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్ర సీహెచ్వోల ఒక రోజు సమ్మె విజయవంతం
ముంబయి: ఉద్యోగాలు పర్మినెంట్ చేయా లని డిమాండ్ చేస్తూ మహారాష్ట్రలోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సిహెచ్ఓలు) బుధవారం ఒక రోజు సమ్మె నిర్వహించారు. ముంబయి అజాద్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ సం ఖ్యలో హాజరయ్యారు. ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, పని ఒత్తిడి తగ్గించాలని, వేతనాలు సకాలంలో అందించాలని, రాష్ట్ర ప్రభుత్వం బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాం తాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. సిహెచ్ఓలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది 5 శాతం వరకూ నెలవారీ వేతనాలు పెంపు అమలు చేసేదని, 2017 నుంచి దీనిని అమలు చేయడం లేదని, ఆ బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.