Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ :ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమ కోసం కేంద్రం ప్రాయోజిత పథకాల కేటాయింపులు తగ్గాయి. గత బడ్జెట్‌లో రూ.1,819.52 కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.976.86 కోట్లకు తగ్గించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలకు ఈసారి నిధులు కేటాయించలేదు. మహిళా, శిశు సంక్షేమానికి సంబంధించిన పోషకాహారం, భద్రత, సంక్షేమానికి కేటాయింపులు భారీగా తగ్గించారు. 2022-23లో రూ.3,512.88 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్‌లో రూ.1,514 .32 కోట్లకు తగ్గించారు. యువజన, క్రీడల రంగంలోనూ కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేటాయింపులో కోత విధించారు. స్పేస్ రంగంలో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌కు కేటాయింపులు భారీగా తగ్గించారు.
మహిళలు, వృద్ధుల కోసం...
మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనే కొత్త పథకాన్ని బడ్జెట్‌లో కేంద్రం ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఈ పథకంలో డిపాజిట్ చేయొచ్చు. పాక్షిక మినహాయింపులకు అవకాశం ఉంటుంది.
సీనియర్ సిటిజన్లు డిపాజిట్ చేసే గరిష్ఠ పరిమితిని రూ.30 లక్షలకు పెంచింది. సీనియర్ సిటిజన్లకు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కింద ప్రస్తుతం గరిష్ఠ పరిమితి రూ.15 లక్షల వరకు మాత్రమే ఉంది.