Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ :తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి విమర్శించారు. బుధవారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ''బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపింది బయ్యారం ఉక్కు కర్మాగారానికి నిధుల్లేవు. సాగునీటి ప్రాజెక్టులకు నిధుల్లేవు. పేదల పట్ల ఈ ప్రభుత్వానికి ఎలాంటి ప్రేమ, పట్టిం పు లేదు. కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అండగా నిలబడింది. బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి బీజేపీ, బీఆర్‌ఎస్ ఇద్దరు దోషులే. మోడీ, కెసిఆర్ ఇద్దరు తోడు దొంగలు తెలంగాణ కు అన్యాయం చేశారు'' అని విమర్శించారు.''ఇప్పటికైనా తెలంగాణ లో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హౌదా ఇవ్వాలి. రాష్ట్రంలో ప్రతీ పేదవాడికి ఇళ్లు నిర్మించేందుకు అవసరమైన నిధులను కేంద్రం కేటాయిం చాలి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించాలి. మోడీ మీరు గుజరాత్‌కు సీఎం కాదు.. ఈ దేశానికి ప్రధాని. నిధుల కేటాయింపులో గుజరాత్‌కు కల్పిం చిన ప్రాధాన్యత ను తెలంగాణకు కల్పించండి. మోడీ అన్యాయం చేస్తుంటే.. నిలదీయాల్సిన బీఆర్‌ఎస్ సభలో నిస్సహాయంగా నిలబడింది. అవినీతిని కప్పి పుచుకోవ డానికే.. కెసిఆర్ కేంద్రంతో కాళ్లబేరానికి దిగారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది'' అని అన్నారు..