Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : సమస్యలను పరిష్కరించడంలో బడ్జెట్ విఫలం అయిందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంపై ధ్వజమెత్తారు. అతి ధనవంతులపై పన్ను విధించాలని, మౌలిక సదుపాయాలలో పెట్టుబడుల నేపథ్యంలో యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, మందగమనాన్ని పరిష్కరించడంలో బడ్జెట్ విఫలమైందని విమర్శించారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడంతోపాటు దేశీయంగా డిమాండ్‌ను పెంచడంపై బడ్జెట్‌లో దృష్టి సారించాలని ఆయన అన్నారు.
''ధనవంతులపైన ముఖ్యంగా లాభాన్ని ఆర్జిస్తున్న ధనవంతులపై పన్ను విధించాలి. గత రెండేళ్ళలో ఉత్పత్తి చేయబడిన సంపదలో దాదాపు 14.5 శాతం ప్రజల ఒక శాతం మంది ధనవంతుల చేతుల్లో ఉంది. వాటిపై పన్ను విధించండి'' అని ఏచూరి అన్నారు.
ధనవంతులకు రాయితీలు ఇచ్చే బదులు, ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టాలని అన్నారు. ఖర్చు చేసే యువత కోసం కోట్లాది కొత్త ఉద్యోగాలను సృష్టించాలని ఆయన అన్నారు. కాని దానికి బదులుగా ధనికులకు మరిన్ని రాయితీలు ఇచ్చారని విమర్శించారు. అత్యధిక పన్ను శ్లాబును కూడా తగ్గించారని, ఈ పన్ను రాయితీల వల్ల వచ్చే ఏడాది ఆదాయ వసూళ్ల పరంగా రూ. 35,000 కోట్ల నష్టం వాటిల్లుతుందని స్వయంగా ఆర్థిక మంత్రి ప్రకటించారని పేర్కొన్నారు.
''వేతన జీవులకు కొంత ఉపశమనం లభించడం మంచిదే. అయితే ద్రవ్యోల్బణం, సామాజిక సేవలకు కేటాయింపులు క్షీణించిన స్థితిలో, ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.
కాబట్టి పన్ను పరంగా ఎలాంటి ఉపశమనం లభించినా ధరల పెరుగుదల, ఆరోగ్యం, విద్యతో సహా ప్రజా సేవలలో ఖర్చు తగ్గడంతో భర్తీ చేయబడుతుంది''అని విమర్శించారు. ప్రభుత్వ మూలధన వ్యయం నామమాత్రంగా ఏడు శాతం పెరిగిందని ఏచూరి అన్నారు. రాష్ట్ర, కేంద్రం సంబంధాలపై ఒత్తిడి గురించి వ్యాఖ్యానించిన ఏచూరి ఆర్థిక సమాఖ్యవాదం ఇప్పుడు తీవ్ర దాడిలో ఉందని విమర్శించారు.
''రాష్ట్రాలు తీసుకునేందుకు వీలుగా రుణాల విషయంలో రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం ఇవ్వబడింది. ఇప్పుడు రుణాలపై కొత్త షరతులు పెట్టారు. జీఎస్టీ తర్వాత రాష్ట్రాలు వనరులను పెంచుకోలేవు. కొత్త షరతుల ప్రకారం రుణాలు తీసుకోవడానికి వీలు లేదు. కాబట్టి రాష్ట్రాలను భిక్షాటనకు వచ్చేలా కేంద్రం వ్యవహరించింది'' అని పేర్కొన్నారు.
''కర్నాటకకు భారీగా కేటాయించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ప్రయోజనాలు లభిస్తాయని, బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరుకున పడతాయని చాలా స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి, ఇది మన రాజకీయాలలో గొప్ప ఒత్తిడికి దారి తీస్తుంది'' అని ఏచూరి అన్నారు. అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెట్టాలని న్నారు.