Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టులో 7 ఖాళీలు ...హైకోర్టుల్లో 334 ... జిల్లా కోర్టుల్లో 5,767
- రాజ్యసభలో కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు కొలీజియం చేసిన 18 సిఫారసులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపినట్టు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. గురువారం రాజ్యసభలో సీపీఐఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అడిగిన రెండు ప్రశ్నలకు కేంద్ర లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. న్యాయమూర్తి పదవికి సుప్రీంకోర్టు కొలీజియం చేసిన 18 సిఫారసులను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించిందనీ, ఆ ఫైళ్లను కొలీజియంకు తిరిగి ఇచ్చిందని తెలిపారు. కొలీజియం చేసిన 64 సిఫారసులు ప్రభుత్వం ముందు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ''జనవరి 31 నాటికి కొలీజియం సిఫారసు మొత్తం 18 ప్రతిపాదనలు ఉన్నాయి. వాటిలో 6 సిఫారసులను కొలీజియం పునరుద్ఘాటించింది. 7 సిఫారసులకు సంబంధించి హైకోర్టు కొలీజియంల నుంచి తదుపరి ఇన్పుట్లను కోరింది. 5 సిఫారసులను రద్దు చేయాలని నిర్ణయించింది'' అని సమాధానంలో పేర్కొన్నారు.
హైకోర్టులో 333 న్యాయమూర్తి పోస్టులు ఖాళీ
వివిధ హైకోర్టుల్లో 1,108 మంది న్యాయమూర్తులు ఉండగా, ప్రస్తుతం 775 మంది న్యాయమూర్తులు ఉండగా, 334 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. ఈ ఖాళీలకు సంబంధించి హైకోర్టు కొలీజియాలు సిఫారసు చేసిన 142 ప్రతిపాదనలు ప్రాసెసింగ్లో వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు. 2019 నుంచి జనవరి 2023 వరకు సుప్రీంకోర్టుకు 22 మంది న్యాయమూర్తులు, వివిధ హైకోర్టులకు 446 మంది న్యాయమూర్తులు నియమితులయ్యారని తెలిపారు. సుప్రీం కోర్టులో ప్రస్తుతం 7 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 5, తెలంగాణ హైకోర్టులో 10 న్యాయమూర్తి పోస్టులు ఖాళీగా ఉన్నాయని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 2023 జనవరి 30 వరకు దేశంలో జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 5,767 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏపీలో 76, తెలంగాణలో 150 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మల్లికార్జున ఖర్గే అడిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.