Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : సంక్షేమ, అభివృద్ధి పథకాలను జగన్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అందిస్తోందని, వైసిపితోనే భరోసా ఉంటుందనే అంశాన్ని క్షేత్రస్థాయిలో చాటి చెప్పాలని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని శుభమస్తు కళ్యాణ మండపంలో హర్దిల్ మే వైఎస్ఆర్ -హమ్ సబ్ జగన్ కే సాథ్ అనే నినాదంతో వైసిపి మైనార్టీ సెల్ ఆధ్వర్యాన గురువారం రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. రాజకీయంగా ముస్లిములకు ఎన్నో పదవులను జగన్ కట్టబెట్టారని తెలిపారు. ఈ మూడున్నర ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.21 వేలకోట్లను మైనార్టీల కోసం ఖర్చు చేసిందన్నారు. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ.. మైనార్టీ విద్యార్థులు చదువుకునే స్కూళ్లను సిఎం జగన్ అభివృద్ధి చేశారన్నారు. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయంగా ఎంతో మందికి అవకాశం కల్పించిన జగన్‌పై టిడిపి సాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సమావేశంలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ జకియా కానమ్, ఎమ్మెల్సీ రుహుల్లా, వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు.