Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిఎం సమాధానం చెప్పాలి : టీడీపీ అధినేత చంద్రబాబు
అమరావతి : కర్ణాటక రాష్ట్రం తలపెట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణంతో సాగునీటి పరంగా రాయలసీమ ప్రాంతానికి తీవ్ర నష్టం జరగనుందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జగన్ కనీస స్పృహ లేకుండా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి ఇన్ఛార్జులు, ముఖ్యనేతలతో చంద్రబాబు పలు అంశాలపై ఆన్లైన్ విధానంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే సీమ ప్రాజెక్టులను మూలన పడేసి ప్రభుత్వం నష్టం చేసిందని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ గతంలో చెప్పిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏమైందని ప్రశ్నించారు. పోలవరం, నదుల అనుసంధాన ప్రాజెక్టులు పూర్తయి ఉంటే రాష్ట్రంలో ప్రతి ఎకరాకూ నీళ్లు ఇచ్చే అవకాశం ఉండేదని తెలిపారు. రాష్ట్రాన్ని జగన్ ఎటుతీసుకెళ్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను అణచివేసేందుకు జిఓ 1 తేవడం, రాజకీయ పక్షాలపై ఆంక్షలు, కేసులు, ఫోన్ ట్యాపింగ్ వంటి వ్యవహారాలు తప్ప ముఖ్యమంత్రికి రాష్ట్రం గురించి పట్టడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్ అడుగడుగునా రాజీ పడుతున్నారని అన్నారు. విభజన చట్టం ప్రకారం సాధించాల్సిన హక్కుల విషయంలో వైసిపి ప్రభుత్వ వైఫల్యం రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. విభజన హక్కుల సాధనలో కీలకమైన చివరి కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు పొందడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వైసిపి ఎంపిలు సొంత లాబీయింగ్ కోసమే పనిచేస్తున్నారని, రాష్ట్రం కోసం కాదని అన్నారు.