Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- విదేశాల నుంచి హెలికాప్టర్లు, రాడార్లు, రాకెట్లు, రైఫిల్స్
న్యూఢిల్లీ: రక్షణరంగ ఉత్పత్తుల్లో భారత్ స్వయం సమృద్ధి సాధించలేదనే సంగతి, మోడీ సర్కారే బయట పెట్టుకుంది. గత ఐదేండ్లలో మన దేశం దాదాపు రూ.2లక్షల కోట్ల విలు వజేసే మిలటరీ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుందని లోక్‌సభలో కేంద్రం వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తాజాగా సభకు అందజేసింది. ఈ వివరా ల ప్రకారం, భారత సైన్యానికి అవసరమయ్యే అత్యంత కీలకమైన ఆయుధ సామాగ్రిని విదేశాల నుంచి కేంద్రం కొనుగోలు చేసింది. 2017-18 నుంచి 2021-22 మధ్య ఐదేండ్ల కాలంలో హెలి కాప్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ రాడార్లు, రాకెట్లు, తుపాకులు, రైఫిల్స్, మిస్సైల్స్, మందుగుండు..మొదలైనవి భారత్ దిగుమతి చేసుకుంది. వీటి విలువ సుమారు గా రూ.2లక్షల కోట్లు ఉంటుందని రక్షణశాఖ సహా యమంత్రి అజరు భట్ తెలిపారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలుపై వస్తున్న ఫిర్యాదుల పరిష్కా రానికి ఏకసభ్య న్యాయ కమిటీ ఏర్పాటు చేసే ఆలోచన లేదని చెప్పారు. రూ. 73,942 కోట్ల విలువజేసే 55 మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్ డీఆర్‌డీవోకు అప్పగించామ ని, వాటి పనులు జరుగుతున్నాయని అజరు భట్ అన్నారు. రక్షణ ఉత్పత్తుల దిగుమతిపై ఆయన మాట్లాడుతూ, ''రక్షణ ఉత్పత్తుల సేకరణ విధానం- 2020 ప్రకారం ఈ దిగుమతులు చోటుచేసు కున్నాయి. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియాపై దృష్టి సారించి, స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ దిగుమతులు దోహదపడ్డాయి. దేశీయంగా ఉత్పత్తుల సేకరణకు ప్రాధాన్యత ఇచ్చాం. రక్షణ ఉత్పత్తుల సేక రణ కౌన్సిల్, రక్షణశాఖ ఆమోదంతో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దిగుమతులు చేపట్టామని చెప్పారు. గత ఐదేండ్లు, ఈ ఆర్థిక సంవత్సరం డిసెం బరు నాటికి మిలటరీ ఉత్పత్తుల దిగుమతులపై విదేశీ సంస్థలతో 264 కాంట్రాక్ట్ ఒప్పందాలు కుది రాయని అన్నారు. మొత్తం దిగుమతుల్లో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, స్పెయిన్..తదితర దేశాల దిగుమతు లు 36.26 శాతం ఉందని అజరు భట్ చెప్పారు.