Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టుకు చిదంబరం విజ్ఞప్తి
న్యూఢిల్లీ : చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఇక నుంచైనా నిరోధించాలని సుపీంకోర్టుకు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు పి. చిదంబరం ఆదివారం విజ్ఞప్తి చేశారు. 2019 జామియా నగర్ అలర్లల కేసులో 11 మందిని నిర్ధోషులుగా సుప్రీంకోర్టు శనివారం విడుదల చేసింది. పోలీసులు వీరిని 'బలిపశువులు'గా మార్చారని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనికి ఒక రోజు తరువాత చిదంబరం ఈ విజ్ఞప్తి చేశారు. విచారణకు ముందే శిక్షను విధించే నేర న్యాయ వ్యవస్థ రాజ్యాంగానికి అవమానకరమని చిదంబరం ఆదివారం ట్వీట్ చేశారు. 'ఈ కేసుకు కోర్టుకు ముగింపు పలికింది. అయితే ఇందులో కొందరు నిందితులు దాదాపు 3 ఏళ్లు జైలులో ఉన్నారు. ఇది విచారణకు ముందే శిక్ష వంటింది', 'విచారణకు ముందే ప్రజలకు శిక్ష విధించడానికి పోలీసులు అత్యుత్సాహంతో పనిచేస్తారు. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు' అని చిదంబరం వరస ట్వీట్లతో ప్రశ్నించారు. 'విచారణకు ముందే శిక్ష విధించడం మన న్యాయ వ్యవస్థ, రాజ్యాంగానికి అవమానకరం. చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని సుప్రీంకోర్టు ముగింపు పలకాలి. ఇది ఎంత త్వరగా అయితే అంత మంచిది' అని చిదంబరం తెలిపారు.