Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోర్ట్‌బ్లెయిర్ : సామూహిక లైంగికదాడి కేసులో అండమాన్ నికోబార్ మాజీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర నారైన్తో పాటు మరో ముగ్గురిపై ప్రత్యేక దర్యాప్తు బృందం 935 పేజీల చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసు దర్యాప్తు కోసం మాజీ ఐపీఎస్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన దర్యాప్తు ఈ బృందాన్ని అండమాన్ నికోబార్ పోలీసులు ఏర్పాటు చేశారు. 90 మంది సాక్ష్యులు, వివిధ ఎలక్ట్రానిక్, టెక్నికల్, బయోలాజికల్ ఆధారాల ద్వారా ఈ చార్జిషీట్‌ను రూపొందించినట్టు పోలీసులు తెలిపారు. గత ఏడాది ఏప్రిల్, మేల్లో అప్పటి ప్రధాన కార్యదర్శి నివాసంలో తనపై రెండుసార్లు సామూహిక లైంగికదాడి జరిగిందని ఒక మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదయింది. హైకోర్టు ఆదేశాలతో గత ఏడాది అక్టోబర్ 10న ఈ కేసును నమోదుచేశారు. గత నవంబర్ 15న జితేంద్రను పోలీసులు అరెస్టు చేశారు.