Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశీయంగా ఉత్పత్తి చేసే ముడిచమురుపై విధించే విండ్‌ఫాల్ ఫ్రావిట్ ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం పెంచింది. అలాగే డీజిల్, విమాన ఇంధనం (ఎటిఎఫ్) ఎగుమతులపై విధించే పన్నునూ కేంద్రం పెంచింది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా వీటిని పెంచినట్లు కేంద్రం తెలిపింది. పెంచిన ఈ పన్నులు ఈ నెల 4 నుంచే అమల్లోకి వచ్చాయి. ఓఎన్‌జిసి వంటి సంస్థలు ఉత్పత్తి చేసే ముడిచమురుపై టన్నుకు రూ. 1,900గా ఉన్న విండ్‌ఫాల్ ఫ్రావిట్ ట్యాక్స్‌ను ఒక్కసారిగా రూ.5,050కు కేంద్రం పెంచింది. భూగర్భ, సముద్ర గర్భాల నుంచి సేకరించే ముడి చమురు నుంచి పెట్రోల్, డీజిల్, ఎటిఎఫ్ వంటి ఇంధనాలుగా మారుస్తారు. అలాగే ఎగుమతి చేసే డీజిల్‌పై లీటరుకు రూ.5గా ఉన్న పన్నును రూ. 7.5కు ప్రభుత్వం పెంచింది. ఎటిఎఫ్‌పై లీటరుకు రూ. 3.5గా ఉన్న పన్నును రూ 6కు కేంద్రం పెంచింది. ఈ పెంపుతో పన్నులు గరిష్ట స్థాయికి చేరాయి. విండ్‌పాల్ ఫ్రావిట్ ట్యాక్స్‌ను భారత్‌మొదటిసారిగా జులై 1న విధించింది.