Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయవాడ : వైసీపీ శాసనమండలి సభ్యులు తలశిల రఘురాం సతీమణి స్వర్ణకుమారి (44) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె విజయవాడలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. స్వర్ణకుమారి మృతిపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిఎం దంపతులు విజయవాడ గొల్లపూడిలోని తలసిల రఘురాం నివాసానికి వచ్చారు. రఘురాం భార్య స్వర్ణకుమారి భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. స్వర్ణకుమారి భౌతికకాయాన్ని రాష్ట్ర మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, వసంత వెంకట కృష్ణ ప్రసాద్, కైలే అనిల్, సింహాద్రి రమేష్, బాలినేని, గొల్లపూడి ఎఎంసి మాజీ చైర్మన్ కొమ్మ కోట్లు, యర్కారెడ్డి నాగిరెడ్డి, కాటంనేని పూర్ణ, ఒంకర్ రెడ్డి, ఎంపిపి ప్రసన్నకుమారి, తదితరులు సందర్శించి నివాళులర్పించారు. ఆదివారం సాయంత్రం గొల్లపూడిలోని స్మశాన వాటిలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. స్వర్ణకుమారి మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.