Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జైపూర్ : ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగించిన యోగా గురు బాబా రాందేవ్‌పై కేసు నమోదయింది. రాజస్థాన్‌లోని బర్మేర్ జిల్లాలోని చౌహతన్ పోలీస్‌స్టేషన్‌లో స్థానిక నివాసి పతే ఖాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ నెల 2న ఇక్కడ జరిగిన ఒక సభలో ముస్లింలు, క్రిస్టియన్లు మతమార్పిడులు చేస్తారని, ఉగ్రవాద కార్యక్రమాలకు పాల్పడతారని, కిడ్నాపులు చేస్తారని రాందేవ్ విద్వేష ప్రసంగం చేశారు.