Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగర్తలా : 'బీజేపీ హఠావో.. త్రిపుర బచావో..' అంటూ నినాదాలతో త్రిపుర రాజధాని అగర్తలా హౌరెత్తింది. త్వరలో ఎన్నికలు జరగనున్న త్రిపురలో రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాలు విస్తృతంగా ర్యాలీలు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి త్రిపురలో ప్రజాస్వామ్యాన్ని మంటగలిపి దాడులు నిర్వహిస్తున్న తీరును నిరసిస్తూ వామపక్షాలు, కాంగ్రెస్ అగర్తలాలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించాయి.
త్రిపురలో సీపీఐ(ఎం) విస్తృత ప్రచారం
ఈ నెల 16న ఎన్నికలు జరిగే త్రిపురలో సీపీఐ(ఎం) విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. సీపీఐ(ఎం) అభ్యర్థులకు ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తుంది. బోర్జల అసెంబ్లీ నియోజకవర్గంలో వామపక్ష అభ్యర్థి సుదీప్ సర్కార్‌కు మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. సీపీఐ(ఎం)కి ఓటు వేసి బీజేపీ గూండాయిజం నుంచి త్రిపురను రక్షించాలని పిలుపునిచ్చారు. ప్రతాప్‌గఢ్ నియోజకవర్గంలోనూ మాణిక్ సర్కార్ ప్రచారం నిర్వహించారు. ఇక్కడ లెఫ్ట్‌ఫ్రంట్ అభ్యర్థి రాము దాస్‌కు అనుకూలంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది యువకులు, ప్రజలు ఎర్ర జెండాలతో ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అమర్పురా నియోజకవర్గంలోనూ లెఫ్ట్‌ఫ్రంట్ అభ్యర్థి పరిమళ్ దేవనాథ్‌కు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రైమావళి అసెంబ్లీ నియోజకవర్గంలో వామపక్ష అభ్యర్థికి ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది.