Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలువైన సమయం వృధా
- బీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు
న్యూఢిల్లీ : ఆదానీ అంశంపై చర్చించకుండా మోడీ సర్కార్ పారిపోతున్నదని బీఆర్ఎస్ ఎంపీలు కె. కేశవరావు, నామా నాగేశ్వరరావు విమర్శించారు. సోమవారం నాడిక్కడ ఎంపీ కె.కేశవరావు మాట్లాడుతూ మూడు రోజుల విలువైన సమయం వృధా అయిందని, కేంద్ర మంత్రులు మాత్రం ప్రతిపక్షాలు చర్చించకుండా పారిపో తున్నాయని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్లమెంటులో చర్చ జరగకుండా చేయడమంటే ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడవ డమేనని విమర్శించారు. రాజ్యసభ చైర్మెన్ చర్చ జరపడానికి ఇచ్చిన నోటీ సులను అకారణంగా తిరస్కరిస్తున్నారని విమర్శించారు. తన పార్ల మెంట్ జీవితంలో మొదటిసారి రాజ్యసభ చైర్మెన్ ఈ విధంగా వ్యవ హరించడం చూస్తున్నానని అన్నారు. ప్రతిపక్షాలు చర్చ జరపాలని కోరుకుంటున్నాయనీ తెలిపారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రం చిత్తశుద్ధితో ఉంటే అదానీ అంశంపై ప్రతిపక్షాల కంటే ముందు, కేంద్రం చర్చకు రావాలని సూచించారు. సభ నుంచి పారిపోయే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరించకపోయినా, రాష్ట్రం తనకున్న వనరులతో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని అన్నారు.