Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రఖ్యాత నవలా రచయిత సల్మాన్ రష్డీపై ఐదు నెలల క్రితం న్యూయార్క్లో ఓ బహి రంగ సభలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయన కుడి కన్ను కోల్పోయారు. కాగా, తన ఫొటోను తొలి సారి సోషల్మీడియాలో ఆయన పోస్టు చేశారు. ఫొటోతోపాటు 'దాడి జరిగిన తర్వాత ఇలా ఉన్నాను' అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ దాడి తర్వాత ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను చాలా అదష్టవంతుడిని. ప్రాణాలతో బయటపడ్డాను. కానీ ఈ దాడిలో నాకు తగిలిన కత్తిపోట్ల వల్ల చేతివేళ్లలో పట్టు కోల్పోయాను. అంతకుముందులా.. ఇప్పుడు నేను బాగా టైప్ చేయ లేకపోతున్నాను' అని అన్నారు. అతను తాజాగా రాసిన కొత్త నవల 'విక్టరీ సిటీ'. ఇది విజయనగర సామ్రాజ్య నేపథ్యంలో రాసిన నవల. ఇది మంగళ వారం విడుదలైంది.