Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. ఎన్టీఏ విడుదల చేసిన పేపర్ -1 (బీఈ/బీటెక్) ఫలితాల్లో టాప్ -20 విద్యార్థుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే ఐదుగురు ఉన్నారు. దేశవ్యాప్తంగా 20మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా.. ఆ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన
వావిలాల చిద్విలాస్ రెడ్డి, దుగ్గినేని వెంకట యుగేశ్, గుత్తికొండ అభిరామ్, బిక్కిన అభినవ్ చౌదరి, అభినీత్ మాజేటి నిలిచి తమ సత్తాను చాటుకున్నారు.
20మందికి 100 పర్సంటైల్.. టాపర్ల జాబితా ఇదే..
ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు వివిధ తేదీల్లో జరిగిన జేఈఈ మెయిన్- 2023 తొలి విడత పరీక్షలు రాసేందుకు దేశ వ్యాప్తంగా దాదాపు ఎనిమిదిన్నర లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే. ఏప్రిల్ 6 నుంచి 12వరకు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు జరగనున్నాయి. తొలి విడత రాసిన విద్యార్థులు.. రెండో విడతకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష తర్వాత ఎన్టీఏ ఆల్ ఇండియా ర్యాంకుల్ని ప్రకటిస్తుంది. ఆ తర్వాత విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ప్రవేశాల ప్రక్రియను చేపట్టనున్నారు.