Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించండి
- త్రిపురలో ఎన్నికల బహిరంగ సభల్లో మాణిక్ సర్కార్ పిలుపు
అగర్తలా : త్రిపురలో ప్రజాస్వామ్యాన్నీ, ప్రజానుకూల ప్రభుత్వాన్నీ పునరుద్ధరించేందుకుగానూ వామపక్ష అభ్యర్ధులను ఎన్నుకోవాల్సిందిగా సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ప్రజలను కోరారు. అంబాసా, సుర్మా కమలాపూర్‌లలో జరిగిన ఎన్నికల సభల్లో ఆయన ప్రసంగించారు. గత ఐదేండ్ల పాలనలో బీజేపీ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఓటమి అనివార్యమని ఆయన వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను మోసపుచ్చడం ద్వారా బీజేపీ గెలుపొందిందన్నారు. ఈ ఐదేండ్లలో బీజేపీ పాలనలో 25 మంది సీపీఐ(ఎం) కార్యకర్తలు, నేతలు హత్యకు గురయ్యారని అన్నారు. బీజేపీ కిరాయి మూకల చేతిలో వందలాది పార్టీ కార్యాలయాలు దగ్ధమయ్యాయన్నారు.
భయాందోళనలతో వేలాదిమంది వామపక్ష కార్యకర్తలు ఇండ్లు విడిచి వెళ్ళిపోయారని అన్నారు. లౌకిక, ప్రజాస్వామ్య శక్తులకు ఓటు వేయడం ద్వారా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలనీ, తద్వారా ప్రజానుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించాలని మాణిక్ సర్కార్ కోరారు. రాష్ట్రంలో వామపక్షాలకు, కాంగ్రెస్‌కు మధ్య ఏర్పడిన ఎన్నికల అవగాహన చూసి బీజేపీ భయపడు తోందని అనా్నరు. 'ఫాసిస్ట్ పాలకుల'ను గద్దె దింపేందుకు ప్రధాన ప్రతిపక్షాలు అవగాహన కుదుర్చుకోవడంతో బీజేపీ వెన్నులో వణుకు మొదలైందన్నారు.