Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17న విచారిస్తామన్న సిజెఐ ధర్మాసనం
న్యూఢిల్లీ: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో స్టేటస్ కో ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిబిఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బుధవారం సిజెఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లుత్రా అంశాన్ని లేవనెత్తారు. సిబిఐ చేతికి సాక్షులు వెళ్తే చేసేది ఏమీ లేదని సిద్ధార్థ లూత్రా అన్నారు. మెరిట్స్ ఉంటే హై కోర్టు తీర్పును రివర్స్ చేస్తామని ధర్మాసనం పేర్కొంది. స్టేటస్ కో ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. త్వరితగతిన విచారించడానికి నిరాకరించిన ధర్మాసనం, 17న విచారణ జరిపేందుకు అంగీకరించింది.