Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ ప్రభుత్వ నిర్ణయం
- అనంతపురం జిల్లాలో కేటాయింపుశ్రీ క్యాబినెట్ నిర్ణయం
అమరావతి: అదాని అక్రమాలపై దేశ వ్యాప్తంగా వ్యక్తమవుతున్న ఆందోళనను ఏపీ ప్రభుత్వం బేఖాతరు చేసింది. పార్లమెంటులో చర్చకు విపక్షాలు పట్టుబడుతున్న సమయంలోనే అనంతపురం జిల్లాలో మరో 406.40 ఎకరాల భూమిని అదాని సంస్థలకు అప్పగించడానికి రంగం సిద్ధం చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అదానిగ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌కు 500మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు 406.40 ఎకరాల భూమిని ఎకరం రూ.5లక్షల వంతున ఇవ్వాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. అనంతపురం జిల్లా తాడిమర్రిమండలం పెద్దకోట్ల దాడితోట గ్రామాల పరిధిలో ఈ భూములు కేటాయించనున్నారు. దీంతో పాటు కర్నూలులో 50 ఎకరాల విస్తీర్ణంలో న్యాయ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, 1998 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులు 4,534మందికి మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేస్తూ ఎస్జిటి పోస్టులను భర్తీ చేయాలని క్యాబినెట్ ఆమోదించింది. ఉగాదికి అందించే సంక్షేమ పథకాలకు కూడా మంత్రిమండలి గ్రీన్‌సిగల్ ఇచ్చింది. ఈ సమావేశంలో 70 అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. క్యాబినెట్ నిర్ణయాలను రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వివరించారు. వైఎస్ఆర్ లా నేస్తం, వైఎస్ఆర్ ఆసరా, ఇబిసి నేస్తం, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపినట్టు ఆయన చెప్పారు. .ఈనెల10న కళ్యాణమస్తు, షాదీతోఫాలను ప్రారంభిస్తామని, కళ్యాణమస్తుకు దరఖాస్తు చేసుకునే వార పదవతరగతి పాసై ఉండాలని తెలిపారు. ఏ సీజన్లో పంట నష్టపోతే అదే సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు కూడా ఆమోదం తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. 28న జగనన్న విద్యా దీవెన పూర్తి స్దాయి రీ ఎంబర్స్మెంట్ రూ.700కోట్లు విద్యార్ధులకు అందచేస్తామన్నారు. ఉగాది సందర్భంగా మహిళా సంఘాలకు 79లక్షల మంది మహిళలకు మూడో విడత సుమారు 6,500కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉగాది వేడుకలు వారం రోజుల పాటు చేసుకునేందుకు వీలుగా ఆసరా మూడో విడత పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద 3,255 ప్రొసీజర్స్‌ను ఎక్కడ వైద్యం చేయించినా పథకం వర్తించేలా మార్పులు చేస్తున్నట్లు తెలిపారు.