Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో పలు పనులను ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం చకచకా నిర్వహిస్తోంది. రాజధాని ఏర్పాట్లలో భాగంగా ఇవి జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. విశాఖలోని పిఎం పాలెం ఆఖరి బస్టాప్ వద్ద పోలీసు శాఖకు వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో మంజూరు చేసిన సుమారు 54 ఎకరాల స్థలాన్ని తాజాగా బుధవారం చదును చేస్తున్నారు. పోలీస్, రెవెన్యూ అధికారులు ఈ పనిలో నిమగమయ్యారు. కొత్త సర్వే నెంబరు 92 నుంచి 100 వరకూ 54 ఎకరాల పైచిలుకు స్థలంలో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో పనులు జరుగుతున్నాయి. ఈ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ స్థలాన్ని చదును చేసేందుకు విశాఖపట్నం ఎంపి ఎంవివి సత్యనారాయణకు సంబంధించిన స్థలంలో నుంచి గ్రావెల్ సరఫరా చేస్తున్నారు. దీంతో, దుమ్ము, దూళి ఎగిరిపడుతుండడంతో స్థానికులు బుధవారం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పోలీసులకు సంబంధించినదని సర్దిచెప్పి అధికారులు వారిని పంపించేశారు