Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మత్స్య,పశు సంవర్ధక శాఖ ప్రకటన
న్యూఢిల్లీ: వైవిధ్యభరితమైన భారత సంస్కృతి, సంప్రదాయాలను కేంద్రీకరించీ, హిందుత్వ వైపు లాక్కెళ్తున్న బిజెపి ప్రతిదానిని పక్కదారి పట్టించే ఎత్తుగడలు వేస్తోంది. వీధులకు పేర్లు మార్చడం, మసీదులు, క్రైస్తవ మందిరాలు కింద హిందూ ఆలయాలున్నాయంటూ రభస చేయడం చూశాం..ఇప్పుడు భిన్న సంస్కృతులను ప్రతిబింబించే దినోత్సవాలను కూడా హైందవీకరించే పన్నాగం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రేమికులు దినోత్సవం జరుపుకునే ఫిబ్రవరి 14ను 'పశు కౌగిలి' (కౌ హగ్) దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి ఎస్ కుమార్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. 'మీరు ప్రేమికుల దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే ఓ ఆవుని కౌగిలించుకోండి' అని అందులో పేర్కొన్నారు. సనాతన సాంప్రదాయాలు అంతరించిపోవడానికి విదేశీ సంస్కృతి కారణమవుతోందని పేర్కొన్నారు.