Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంలో 69 వేలకు పైనే : రాజ్యసభలో కేంద్రం
న్యూఢిల్లీ : భారత్లోని ఉన్నత న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు లక్షల సంఖ్యలో పేరుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా 25 హైకోర్టులలో దాదాపు 60 లక్షల వరకు కేసులు, సుప్రీంకోర్టులో 69 వేలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. సుప్రీంకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని పేర్కొంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్ రిజిజు లిఖితపూర్వక సమాధానాన్ని ఇచ్చారు. ఈ సమాచారం ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నాటికి భారత సర్వోన్నత న్యాయస్థానంలో 65,511 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అలాగే, హైకోర్టులలో 59,87,477 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా 10.30 లక్షల కేసులు తుది తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయి. సిక్కిం హైకోర్టులో అత్యల్పంగా 171 కేసులు పెండింగ్లో ఉన్నాయి.