Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగు రాష్ట్రాల్లో 14 స్థానాలకు ఎన్నికలు
- తొమ్మిది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
- తెలంగాణలో చెరొక స్థానానికి పోలింగ్
న్యూఢిల్లీ :తెలుగురాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణలో ఒక ఉపాధ్యాయ, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల అయింది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనర్థన్ రెడ్డి పదవీ కాలం మార్చి 29తోనూ, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సయ్యద్ అస్సాన్ జాఫ్రి పదవీకాలం మే1తో ముగియనున్నది. అలాగే ఏపీలో 14 ఉపాధ్యాయ, పట్టభద్రుల, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ మార్చి 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మార్చి 16 వెల్లడిస్తారు.రెండు రాష్ట్రాల్లో నోటిఫికేషన్ తేదీతో పాటు ఎన్నికల తేదీ, ఫలితాల వెల్లడి ఒకే రోజున జరగనున్నది.
ఎన్నికల షెడ్యూల్
నోటిఫికేషన్ ఫిబ్రవరి 16
నామినేషన్ల దాఖలకు ఆఖరు తేదీ ఫిబ్రవరి 23
నామినేషన్ల పరిశీలన. ఫిబ్రవరి 24
నామినేషన్ల ఉపసంహరణ. ఫిబ్రవరి 27
పోలింగ్ మార్చి 13
ఎన్నికల ఫలితాలు మార్చి 16