Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత్‌లో బీబీసీని పూర్తిగా నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఇది తప్పుడు భావనగా పేర్కొంది. ఒక డాక్యుమెం టరీ దేశంపై ఎలా ప్రభావం చూపుతుందనీ, ఒక చానెల్‌ను నిషేధిస్తూ ఆదేశాలను ఎలా జారీ చేస్తుందని ప్రశ్నించింది. రిట్ పిటిషన్ పూర్తిగా తప్పుగా భావించబడిందని పేర్కొంది. 2002 గుజరాత్ అల్లర్ల ఘటనకు ప్రధాన బాధ్యుడు అప్పుడు ఆ రాష్ట్ర సీఎంగా ఉన్న నరేంద్రమోడీ.. అని బీబీసీ డాక్యుమెంటరీ విశ్లేషించింది. ''ఇండియా : ది మోడీ క్వశ్చన్'' పేరుతో రెండు భాగాలుగా ఈ డాక్యుమెంటరీ రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ లింకులను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్, యూట్యూబ్‌లను ఆదేశించింది. ఈ డాక్యుమెంట్ నేపథ్యంలో భారత్‌లో బీబీసీని పూర్తిగా నిషేధించాలని హిందూ సేన చీఫ్ విష్ణుగుప్తా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీబీసీ ఉద్దేశపూర్వకంగా భారతదేశ ప్రతిష్టను కించపరుస్తున్నదని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పింకీ ఆనంద్ వాదించారు. ఈ డాక్యుమెంటరీ వెనుక కుట్ర దాగుందని, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)తో విచారణ జరిపించాలని పిటిషన్లో కోరారు.