Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రేమికుల రోజున 'కౌ హగ్ డే' ను పాటించాలన్న ప్రకటనను కేంద్రం వెనక్కి తీసుకుంది. ఈ ప్రకటనను వెనక్కు తీసుకుంటున్నట్టు పశు సంక్షేమ బోర్డ్ కార్యదర్శి ఎస్.కె. దత్తా శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మంత్రి పరుషోత్తమ్ రూపాల నేతృత్వంలో పశు సంక్షేమ బోర్డు పనిచేస్తోంది. దేశ సంస్కృతిని కాపాడుకునేందుకు ఫిబ్రవరి 14వ తేదీన ''కౌ హగ్ డే'' ను పాటించాలంటూ కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే పశు సంక్షేమ బోర్డ్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. విదేశీ సంస్కతి కారణంగానే భారత దేశ వైదిక సాంప్రదాయాలు అంతరించిపోతున్నాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కౌ హగ్ డే ప్రకటనను వ్యతిరేకిస్తూ విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది.