Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 34కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో మరో ఇద్దరు జడ్జీల నియామకానికి కేంద్రం గ్రీన్ సిగల్ ఇచ్చింది. కొలీజియం సిఫారసు చేసిన జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ అరవింద్ కుమార్లు సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా నియమితు లయ్యారు. దీంతో సుప్రీంకోర్టులో న్యాయ మూర్తుల సంఖ్య పూర్తి స్థాయి (34)కు చేరింది. భారత రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం.. రాష్ట్రపతి.. అలహా బాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేష్ బిందాల్, గుజ రాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించారు. వారికి శుభాకాంక్షలు'' అని కేంద్ర న్యాయమంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. ఈ ఏడాది జనవరి 31న సుప్రీంకోర్టు కొలీజియం వారి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ ప్రతిపాదనలను అంగీకరించిన కేంద్రం.. రాష్ట్రపతికి సిఫార్సు చేయగా ఆమోదం తెలిపారు. త్వరలోనే వీరిద్దరూ ప్రమాణస్వీకారం చేయనున్నారు. గతేడాది డిసెంబరులో ఐదుగురు జడ్జీల నియామకానికి సంబంధించి కొలీజియం సిఫారసులను ఇటీవల కేంద్రం ఆమోదించిన సంగతి తెలిసిందే. గతవారం వారు జడ్జీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.