Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం: సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, కోజికోడ్ మాజీ ఎమ్మెల్యే సిపి కుంజు (93) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోజికోడ్ సహకార ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1987లో ముస్లిం లీగ్‌కు కంచు కోటగా ఉన్న కోజికోడ్‌లో భారీ మెజారిటీతో సిపి కుంజు తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. ఎన్నికల వేదికపై ఉత్తమ వక్తగా నిలిచి సీపీఐ(ఎం) దీర్ఘకాల స్టార్ క్యాంపెయినర్‌గా సేవలందించారు. రాష్ట్ర, జాతీయ రాజకీయ పరిణామాలపై హాస్యభరితంగా ప్రసంగించగల చైతన్య వంతమైన వక్తగా ఆయన ప్రజాదరణ పొందారు. కోజికోడ్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యునిగా, వక్ఫ్‌బోర్డు సభ్యునిగా, కేఎస్ఈబీ సంప్రదింపుల కమిటీ సభ్యునిగా కూడా కుంజు సేవలందించా రు. ఆయనకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. కుంజు కుమా రుల్లో ఒకరైన సిపి ముసాఫిర్ అహ్మద్ ప్రస్తుతం కోజికోడ్ కార్పొరేషన్ డిప్యూ టీ మేయర్‌గా పనిచేస్తున్నారు. కోజికోడ్ టౌన్హాల్లో ప్రజల సందర్శనార్థం కుంజు భౌతికకాయాన్ని ఉంచి అనంతరం శుక్రవారం రాత్రి స్థానిక చర్చి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. స్థానిక సీపీఐ(ఎం) నాయ కులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు నివాళులర్పించారు.