Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)తో సంబంధాలున్నట్లు అనుమానిస్తూ బెంగళూరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మహమ్మద్ ఆరీఫ్‌ను అరెస్టు చేశారు. అంతర్గత భద్రత విభాగం (ఐఎస్డి), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో శనివారం ఉదయం అతడిని అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే సిరియాకు వెళ్లి ఉగ్రవాద సంస్థలో చేరేందుకు నిందితుడు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గత రెండేళ్లుగా ఒక ప్రయివేటు ఐటి సంస్థలో వర్క్ ఫ్రం హోం కింద పనిచేస్తున్న ఆరీఫ్ తానిసంద్రలో నివాసముంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఐఎస్ఐఎస్కు సంబంధించిన పేజీల్లో ఆరీఫ్ క్రియాశీలంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆరీఫ్ నుంచి ఒక ట్యాబ్‌ని, ల్యాప్‌ట్యాప్‌ని స్వాధీనం చేసుకున్నారు.