Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్నలిస్టుల భద్రతపై తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలి
- ఎంపీలు, రాజకీయ పార్టీలకు జర్నలిస్టు సంఘాల బహిరంగ లేఖ
న్యూఢిల్లీ : రాజకీయ నేతలు, ఎంపీలు తమ ఎన్నికల వేదికల్లో పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన చార్టర్‌ను చేర్చాలని నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఎన్ఏజే), ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (డీయూజే) బహిరంగా లేఖను విడుదల చేశాయి. గత దశాబ్దంలో అనేక దాడులను ఎదుర్కొన్న భారత దేశంలోని జర్నలిస్టుల భద్రత, భద్రతను నిర్ధారించడానికి తక్షణ నివారణ చర్యల అవసరాన్ని ఈ లేఖ హైలెట్ చేసింది. పెరుగుతున్న మీడియా కార్పొరేటీకరణ, పత్రికా స్వేచ్ఛపై అది చూపుతున్న దుష్ప్రభావాల గురించి కూడా లేఖలో ప్రస్తావిం చాయి. ప్రభుత్వాల విస్తృతమైన ప్రకటనలు మీడియా లోని పెద్ద విభాగాలను కొనుగోలు చేశాయనీ, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని లేఖలో పేర్కొన్నాయి.
లేబర్ కోడ్లపై ఆందోళన
మీడియా గుత్తాధిపత్యం, క్రాస్-మీడియా హౌల్డింగ్లతో సహా మీడియాలోని సమస్యలను పరిష్కరించడానికి ఒక ఉమ్మడి జాతీయ మీడియా కౌన్సిల్, నిపుణుల మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఎన్ఏజే, డీయూజే లు పిలుపునిచ్చాయి. వర్కింగ్ జర్నలిస్టుల చట్టం, 1955, వేతనాల చెల్లింపు చట్టం, 1958 వంటి జర్నలిస్టుల రక్షణ చట్టాలను రద్దు చేయడం మరియు వాటి స్థానంలో లేబర్ కోడ్లను తీసుకురావడంపై కూడా లేఖ ఆందోళన వ్యక్తం చేసింది. మీడియా ఉద్యోగులు, మొత్తం కార్మిక వర్గం హక్కులను కోడ్లు తీవ్రంగా తగ్గించాయని ఇది నొక్కి చెప్పింది.
మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి
భారతదేశంలోని జర్నలిస్టుల పరిస్థితులను మెరుగుపర్చడానికి తీసుకోవాల్సిన పలు చర్యలు, ఉమ్మడి మీడియా కౌన్సిల్ మరియు మీడియా కమిషన్ ఏర్పాటు, క్రాస్ మీడియా యాజమాన్యంపై బాధ్యతాయుతమైన తనిఖీలు, గత వేజ్ బోర్డ్ సిఫారసుల అమలు, అదనంగా జర్నలిస్టులకు సరైన రిస్క్ ఇన్సురెన్స్ కవరేజ్, పెన్షన్ స్కీమ్‌లు, చిన్న, స్వతంత్ర డిజిటల్ మీడియా సెన్సార్షిప్ను ప్రారంభించే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రూల్స్ 2021కు ఇటీవల చేసిన సవరణలను ఉపసంహరిం చాలనడం.. వంటివి లేఖలో జర్నలిస్టు సంఘాలు ప్రస్తావించాయి.
జర్నలిస్టులపై చట్టాల దుర్వినియోగం
జర్నలిస్టులు అరెస్టు చేయడానికి, విచారించడా నికి దేశద్రోహం, పరువు నష్టం, చట్ట విరుద్ధ కార్య కలాపాల (నివారణ) చట్టం (ఉపా) వంటి చట్టాల దుర్వినియోగం, జర్నలిస్టులను ఏకపక్ష అరెస్టులు, హానికరమైన ప్రాసిక్యూషన్ నుంచి రక్షించడానికి ఒక చట్టం కోసం సంఘాలు పిలుపునిచ్చాయి.
ఇండిపెండెంట్ జర్నలిజానికి గణనీయమైన సవాళ్లు
మజిథియా అవార్డు అమలు కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, ఇంటర్నెట్ షట్డౌన్ల దుర్వినియోగానికి ముగింపు పలకాలని కూడా సదరు లేఖ డిమాండ్ చేసింది. తమ డిమాండ్లను సీరియస్‌గా పరిగణిస్తా రనీ, తక్షణమే వాటికి తగిన విధంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాయి. స్వతంత్ర జర్నలిజం ప్రస్తుతం గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటు న్నదనీ, మద్దతు అవసరమని లేఖ నొక్కి చెప్పింది.