Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : ఏరో ఇండియా-2023 ప్రదర్శన ప్రదర్శన ఎన్నో అవకాశాలకు రన్‌వేగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కర్ణాటకలోని బెంగళూరు వేదికగా ఏరో ఇండియా-2023 ప్రదర్శనను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 'నవ భారత సామర్థ్యాలను చాటిచెప్పేందుకు బెంగళూరు గగనతలం వేదికైంది. ఏరో ఇండియా మన బలాన్ని, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఇది కేవలం ప్రదర్శన మాత్రమే కాదు.. మన ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఈ రోజు దాదాపు 100 దేశాలు మన ప్రదర్శనలో పాల్గొంటున్నాయంటే.. భారత్‌పై ఈ ప్రపంచం ఎంత విశ్వాసంగా ఉందో స్పష్టమవుతోంది. ఇప్పుడు విదేశీ రక్షణ రంగ ఉత్పత్తులకు మన దేశం కేవలం మార్కెట్ మాత్రమే కాదు.. ఎన్నో దేశాలకు బలమైన రక్షణ భాగస్వామిగా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ రంగ ఎగుమతిదారుగా ఎదిగే దిశగా భార త్ ముందడుగు వేస్తోంది' అని అన్నారు. ఈ ఎయిర్‌షోలో భాగం ఓగా భారత్, విదేశీ రక్షణ కంపెనీల మధ్య రూ.75 వేలకోట్ల విలువైన 251 ఒప్పందాలు జర గనున్నట్లు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ షోలో చివరి రెండు రోజులైన 16,17 తేదీల్లో సామా న్యులు తిలకించేందుకు కర్నాటక ప్రభుత్వం అవ కాశం కల్పించ నుంది. నిర్వాహకులు ఎంట్రీ టికెట్‌ను రూ.1000గా నిర్ణయిం చారు. భారతీయ, విదేశీ రక్షణ రంగ సంస్థలు ఈ ప్రదర్శనలో.. భారీ ప్రదర్శ నకారుల విభాగంలో తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. వీటిల్లో ఎయిర్ బస్, బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్, ఇజ్రా యిల్ ఏరోస్పేస్, బ్రహ్మోస్ ఏరోస్పేస్, ఆర్మీ ఏవియేషన్, హెచ్‌సి రోబోటిక్స్, సాబ్, సఫ్రాన్, రోల్స్ రాయీస్, ఎల్‌అండ్‌టి, భారత్ ఫోర్జ్ లిమిటెడ్, హెచ్ఎఎల్, బిఇఎల్, బిడిఎల్, బిఇఎంఎల్ వంటి సంస్థలున్నాయి.