Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరుగులు తీసిన జనం
న్యూఢిల్లీ : దేశంలోని పలుచోట్ల సోమవార భూకంపాలు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, ఘజియాబాద్, పంజాబ్, గురుగ్రామ్, నోయిడాల్లో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. అయితే, ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు. ఢిల్లీ వాసులు భూకంపం కారణంగా తమకు ఎదురైన అనుభవాలను ట్విటర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా నెటిజెన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో 4.3 తీవ్రతతో భూకంపం
ఆప్ఘనిస్తాన్‌లో నెల రోజుల వ్యవధిలోనే మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 4.3గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. 'సోమవారం ఉదయం 6.47గంటల సమయంలో ఫైజాబాద్‌కు దక్షిణ- ఆగేయంగా 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం పొడవు 71. 40, 135 కి.మీ లోతులో ఫజియాబాద్కి 100 కిలోమీటర్ల దూరంలో సంభవించింది' అని ఎన్సీఎస్ తన అధికారిక ట్విటర్లో ఈ మేరకు పోస్టు చేసింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే మరోసారి భూకంపం సంభవించినట్టు ఎన్సీఎస్ పేర్కొంది. గత నెలలో జనవరి 22వ తేదీన ఫైజాబాద్‌కు 79 కిలో సమీపంలో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.