Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజేఐ డివై చంద్రచూడ్
న్యూఢిల్లీ: గవర్నర్ రాజకీయ రంగ ప్రవేశం చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతేడాది మహారాష్ట్రలో శివసేన కూటమి ఉద్ధవ్‌ఠాక్రే ప్రభుత్వాన్ని కూలదోసి... ఏక్నాథ్ షిండే ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ రాజకీయ సంక్షోభానికి సంబంధించిన కేసును సుప్రీంకోర్టు విచారించింది. ఈ కేసులో ఉద్ధవ్ ప్రభుత్వ పతనానికి కారణమైన కేసును కోర్టు విచారిస్తున్నది. మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో వాదనలు వినిపించారు. 'మనకు రెండు పార్టీల వ్యవస్థ లేదు. భారతదేశం బహుళ పార్టీల ప్రజాస్వామ్యం. బహుళపార్టీ ప్రజాస్వామ్యం అంటే.. మనం పొత్తుల యుగంలో వున్నాం. అయితే, ఎన్నికల ముందు కూటమి అనేది... ఆయా పార్టీల రాజకీయ సిద్ధాంతాలను బట్టి ఉంటుంది. బీజేపీ - శివసేన పార్టీల మధ్య ఎన్నికలకు ముందు పొత్తు వుంది. ఎన్నికల్లో పార్టీలు ఓటర్ల ముందుకెళ్లాంటే.. స్వతంత్రంగా కాకుండా.. కూటమి పార్టీల భాగస్వామ్య రాజకీయ ఎజెండాగానే వెళతాయి. ఓటరు కూడా.. వ్యక్తిగా కాకుండా రాజకీయ సిద్ధాంతాలకు, పార్టీ ప్రాజెక్టులకే ఓటు వేస్తాడు. గుర్రపు వ్యాపారం అనే మాట వింటుంటాం. ఈ మాటకు తగ్గట్టుగానే.. ఎవరికి వ్యతిరేకంగా (కాంగ్రెస్, ఎన్సీపీ) ఉద్దవ్ వ్యతిరేకంగా పోటీ చేశారో.. చివరకు ఆ పార్టీల పొత్తుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అందుకే ఆ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలే వ్యతిరేకంగా ఓటు వేశారు' అని కోర్టులో వాదించారు.కాగా, తుషార్ మెహతా వాదనలపై.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై చంద్రచూడ్ మాట్లాడుతూ... గవర్నర్ కార్యాలయం నుంచి ఇలాంటి ప్రకటనలు రాకూడదని అన్నారు. 'గవర్నర్ ఇదంతా చెబితే ఎలా వినగలరు? ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ ఇలా ఎలా చెబుతారు? వారు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినప్పుడు విశ్వాస ఓటు వేయమని గవర్నర్ అడిగారు. గవర్నర్ రాజకీయ రంగ ప్రవేశం చేయకూడదు అని మాత్రమే మేము చెబుతున్నాము' అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో చాలా తీవ్రమైన రాజ్యాంగపరమైన ప్రశ్నలు ఉత్పన్నమయ్యే అవకాశముందని బెంచ్‌లోని న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమా కోహ్లి.. అభిప్రాయపడినట్టు ది ట్రిబ్యూన్ తెలిపింది. ఈ కేసు నబమ్ రెబియా కేసును తలపిస్తుందని బెంచ్ అభిప్రాయపడింది.