Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎడిటోరియల్‌లో ఆరెస్సెస్ ఆరోపణ
ఢిల్లీ: భారత్‌లో సమాజశ్రేయస్సు కోసం ప్రజాస్వామ్యయుత పద్దతిలో పోరాడుతున్న హక్కుల కార్యకర్తలు, సామాజికవేత్తలు, పర్యావరణవేత్తలను ఆరెస్సెస్ తన ఎడిటోరియల్‌లో దేశవ్యతిరేక శక్తులుగా అభివర్ణించింది. వీరంతా భారత సుప్రీంకోర్టును ఒక ఆయుధంగా వాడుకుంటూ దేశ ప్రగతి ని అడ్డుకుంటున్నారని పేర్కొన్నది. ఆరెస్సెస్ అనుబంధ మ్యాగజైన్ పాంచ జన్యలో వచ్చిన ఎడిటోరియల్‌లో ఈ విధంగా ప్రస్తావించింది. ''మానవ హక్కుల పేరుతో ఉగ్రవాదులను రక్షించిన ప్రయత్నాల తర్వాత.. పర్యావర ణ: పేరుతో ఇప్పుడు భారత వృద్ధిని అడ్డుకుంటూ ఇబ్బందులు కలగజేస్తు న్నారు'' అని ఆరెస్సెస్ ఆరోపించింది. ఇటీవల దేశం లో సంచలనం సృష్టిం చిన మోడీపై బీబీసీ డాక్యుమె ంటరీని కేంద్రం కట్టడి చేసిన విషయం తెలి సిందే. దీనిపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసిన అంశానికి సం బంధించి ఎడిటోరియల్‌లో సంఫ్‌ు పైవిధంగా పేర్కొనడం గమనార్హం. దేశ వ్యతిరేకశక్తులు మన ప్రజాస్వామ్యంలోని నిబంధనలను అనుకూలంగా మా ర్చుకుంటున్నాయని తెలిపారు. బీబీసీ డాక్యుమెంటరీ ఒక కల్పితగాధ అనీ, భారత ప్రతిష్టను దిగజార్చే చర్య ఇది అని ఎడిటోరియల్‌లో వివరిం చింది.