Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: బీజేపీ సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. గురువారం గుంటూరులోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో తన రాజీనామాను ప్రకటించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తన రాజీనామా లేఖను ఫాక్స్ ద్వారా పంపించినట్టు తెలిపారు. 2014లో మోడీ నాయకత్వంపై ఆకర్షితుడినై బీజేపీలోకి వచ్చానని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలో పరిణామాలు కలచివేస్తున్నాయన్నారు. సోము వీర్రాజు అధ్యక్షుడైన తర్వాత పార్టీ పరిస్థితులు మారాయి. పార్టీలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. కేవలం సోము వీర్రాజు వల్లే బీజేపీకి రాజీనామా చేస్తున్నానంటూ తెలిపారు. పార్టీలో చర్చించకుండా ఎంపీ జీవీఎల్ సొంతంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.