Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సూచన
న్యూఢిల్లీ : గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సుప్రీంకోర్టు సూచించింది. గిరిజన రిజర్వేషన్ల పెంపు జీవో వల్ల ఆదివాసిలకు నష్టం కలుగుతుందంటూ కోడెపాక రోహిత్, ఆధార్ సొసైటీలు దాఖలు చేసిన పిటిషన్లను శుక్రవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాదులు రంజిత్ కుమార్, ఎంఎన్‌రావు, న్యాయవాది అల్లంకి రమేశ్‌లు వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. జీవో కొట్టివేయాలని కోరారు. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టునే ఆశ్రయించాలని ధర్మాసనం సూచించింది. ధర్మాసనం సూచన మేరకు పిటిషనర్లు పిటిషన్లు ఉపసంహరించుకున్నారు.