Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ భారత్‌లో 450 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ప్రపంచ వ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు గడిచిన జనవరిలో గూగుల్ సీఈఓ సుందర్ పిచారు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్‌లో కోతలు ప్రారంభించినట్టు సమాచారం. భారత్‌లోని వివిధ విభాగాల్లో పనిచేసే 450 మంది ఉద్యోగులను తొలగిస్తుందని రిపోర్టులు వస్తున్నాయి. గూగుల్ ఇక్కడ హైదరాబాద్, బెంగళూరు, గుర్గావ్లో ప్రధాన కార్యాలయాలను కలిగి ఉంది. గూగుల్ నుంచి తమను అర్ధంతరంగా తొలగించారని పలువురు ఉద్యోగులు లింక్డిన్లో పోస్ట్ చేస్తున్నారు. గూగుల్ ఇండియాలో ఇటీవల చేపట్టిన లేఆఫ్స్‌లో అధిక నైపుణ్యాలు కలిగిన టాలెంటెడ్ కొలీగ్స్ కొలువులు కోల్పోయినట్టు తెలిసిందని గూగుల్ ఇండియా ఉద్యోగి రజనీష్‌కుమార్ ఓ పోస్ట్‌లో పేర్కొన్నారు. గూగుల్ ఇండియా లేఆఫ్స్‌లో తాను బాధితుడినయ్యానని గూగుల్ ఇండియాలో అకౌంట్ మేనేజర్ కమల్ దవే పేర్కొన్నారు.
భారత్‌లో ట్విటర్ ఆఫీసుల మూత
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ భారత్‌లోని తన మూడు కార్యాలయాల్లో రెండింటిని మూసి వేస్తున్నట్టు సమాచారం. దేశ రాజధాని ఢిల్లీ, ముంబయిలోని ఆఫీసులను మూసివేస్తుందని రిపోర్టులు వస్తున్నాయి. ఈ కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బందిని ఇంటి నుంచి పని చేయాలని సూచించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా.. ఎక్కువ మంది టెక్ ఇంజనీర్లు పని చేస్తున్న బెంగళూరులోని కార్యాలయాన్ని మాత్రం కొనసాగించాలని నిర్ణయించింది. ట్విట్టర్‌ను ఎలన్ మస్క్ కొను గోలు చేసినప్పటి నుంచి అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా సగం పైగా ఉద్యోగులను తొలగిం చారు. భారత్‌లో ఏకంగా 90 శాతం మంది సిబ్బందికి కోత పెట్టారు.