Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్య ఆరోగ్య రంగాన్ని మెరుగు చేయాలి
- వ్యవసాయ కార్మిక సంఘం మహాసభ తీర్మానం
హౌరా నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
గ్రామీణ ప్రాంత ప్రజలకు అంతో ఇంతో ఆసరాగా ఉన్న ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మహాసభ తీర్మానించింది. మహాసభ నాలుగోరోజైన శనివారం పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. తొలుత వైద్య ఆరోగ్య రంగంపై ప్రతినిధి దుర్గాస్వామి తీర్మానం పెట్టారు. దేశంలో కరోనా అనంతరం వైద్య ఆరోగ్య రంగ ప్రాధాన్యత తెలిసిందని, ఈ నేపథ్యంలో ఈ రంగాన్ని మెరుగుపరచడంతోపాటు బడ్జెట్లో నిధులు కూడా పెంచాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది పనులు లేక పోషకాహారలేమి తీవ్రంగా ఉందని అన్నారు. అలాగే తీవ్రమైన అనారోగ్యం బారినపడినా సరైన చికిత్స అందే పరిస్థితి లేదని వివరించారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య రంగానికి నిధులు పెంచాలని తీర్మానించారు. అలాగే గ్రామీణ ప్రాంతంలో పేదలకు అంతోఇంతో ఆసరాగా ఉన్న ఉపాధి హామీకి నిధులు తగ్గించడం సరికాదని వెంటనే నిధులు పెంచాలని తీర్మానించారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో స్వల్ప తగ్గుదల ఉటుందని కేంద్ర ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో చెప్పారని, వాస్తవంగా ఇది మరింత ఉందని వివరించారు. నిరుద్యోగం పేదరికం, పౌష్టికాహారలోపం, పిల్లల మరణాలు పెరుగుతున్నాయని తెలిపారు. యుపిఎ ప్రభుత్వంలో వామపక్షాల ఒత్తిడితో 2006లో ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. 2010 నాటికి దేశవ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇది అమలైందని వివరించారు. ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధి హామీకి నిధులు తగ్గుతున్నాయని తెలిపారు. గత బడ్జెట్లో 73 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తే ఈ ఏడాది 60 వేల కోట్లకు తగ్గించారని వివరించారు. వాస్తవంగా ఉపాధి కరువైన సమయంలో నిధులు పెంచాల్సింది పోయి తగ్గించారని పేర్కొన్నారు. ఎక్కువ కుటుంబాలకు 50 రోజులు పని కూడా ఉండటం లేదని తీర్మానంలో పేర్కొన్నారు. నెలవారీ ఆర్థిక ఖర్చులు పెరిగాయని, దానికి అనుగుణంగా పెరుగుదల ఉండాలని చెప్పారు. జనవరి 2020 నుండి అక్టోబర్ 2022 మధ్యలో 14 మిలియన్ల మంది ఉపాధి కోల్పోయారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి నివేదిక తెలిపిందన్నారు.
మరోవైపు జిడిపి పెరిగిందని నివేదికలు పెడుతున్నారని, అంటే ఉపాధిలేని అభివృద్ధి అని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. నయా ఉదారవాద సంస్కరణల ప్రభావం దీనిద్వారా స్పష్టమవుతోందని, ముఖ్యంగా యువతకు ఉపాధి లభించడం లేదని వివరించారు. శ్రామికశక్తి క్రమంగా నాశనం అవుతోందని ఇది ప్రమాదరకమైన పరిణామమని తెలిపారు పట్టణ ప్రాంతాల్లో మహిళలకు ఉపాధి తగ్గుతోందని పేర్కొన్నారు. కేరళలో అయ్యంకాళి పట్టణ ఉపాధిగ్యారంటీ పథకం ప్రవేశపెట్టి అక్కడివారికి ఉపాధి కల్పించారని వివరించారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ సథకం కింద 100 నుండి 150 రోజుల పని కల్పించాలని, కేరళ మాదిరి పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ఏర్పాటు కోసం ఉద్యమించాలని తీర్మానించారు. మొత్తంగా ఏడు తీర్మానాలను మహాసభ ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఒక తీర్మానంలో స్వల్ప పదమార్పు చేశారు.
సంఘం వెబ్సైట్ ప్రారంభం
మహాసభల చివరిరోజు మహాసభల అర్హతల వివరాలను స్టీరింగ్ కమిటీ సభ్యులు విక్రమ్ ప్రవేశపెట్టారు. ఈ మహాసభకు 695 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వీరిలో 637 మంది ప్రతినిధులు, 47 మంది కేంద్ర వర్కింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. 119 మంది పరిశీలకులుగా ఉన్నారు. వీరిలో 566 మంది పురుషులు, 119 మంది మహిళా ప్రతినిధులు ఉన్నారు. వీరిలో ఎపికి చెందిన శరత్చంద్ర అతి పిన్నవయస్కుడు కాగా, సునీత్ కృష్ణచంద్ర చోప్రా సీనియర్ ప్రతినిధిగా నిలిచారు. ప్రతినిధుల్లో 321 మంది వ్యవసాయ కార్మిక రంగం నుండి రాగా, 368 మంది పూర్తికాలం కార్యకర్తలుగా ఉన్నారు. బెంగాల్‌కు చెందిన సచీంద్రానంద్రారు ఏడు సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపారు. ఏడాదిపైన 11 మంది, రెండేళ్లపైగా 11 మంది మూడేళ్లకుపైగా ఏడుగురు, ఐదేళ్లకుపైగా జైలు జీవితం గడిపారు.
ఏఐఏడబ్ల్యూయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా
విజయరాఘవన్, వెంకట్
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా విజయ రాఘవన్, బి.వెంకట్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 155 మందితో జనరల్ కౌన్సిల్ ఏర్పాటైంది. తెలంగాణా నుంచి 15 మంది, ఏపీ నుంచి 12 మంది జనరల్ కౌన్సిల్లో ఉన్నారు. కేరళ నుంచి 30 మంది, పశ్చిమబెంగాల్ నుంచి 18, తమిళనాడు నుంచి 14, త్రిపుర నుంచి 10, పంజాబ్ 8, కర్నాటక 8, బీహార్ నుంచి ఏడుగురు, ఉత్తరప్రదేశ్ నుంచి ఐదుగురు, మహారాష్ట్ర నుంచి ఆరుగురు, రాజస్థాన్ నుంచి నలుగురు, హర్యానా నుంచి ముగ్గురు, ఒడిస్సా నుంచి ముగ్గురు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, అసోం, ఉత్తరాఖండ్, గుజరాత్ నుంచి ఒక్కొక్కరు చొప్పున నూతన కమిటీకి ఎన్నికయ్యారు. సంఘం అఖిల భారత కేంద్రం నుంచి విజయ రాఘవన్, వెంకట్, విక్రమ్‌సింగ్, వి.శివదాసన్, బాబూమోహన్, షాజీ జనరల్ కౌన్సిల్లో ఉన్నారు. కేంద్రం నుంచి ఒక ఖాళీ పెండింగ్‌లో ఉంది, ఉత్తరాఖండ్, జార్ఖండ్ నుంచి ఒకరికి జనరల్ కౌన్సిల్లో అవకాశం కల్పించినా ఎవరనేది ప్రకటించలేదు.
ఏపీ నుంచి జనరల్ కౌన్సిల్ సభ్యులు
వి.వెంకటేశ్వర్లు, డి.సుబ్బారావు, వి.శివనాగ రాణి, కె.వి.నారాయణ, ఎం.నాగేశ్వరరావు, కె.ఆంజనేయులు, ఎం.పుల్లయ్య, ఎం.రాజేష్, ఎ.రవి,, డి.వెంకన్న, జి.సింహచలం, వి.అన్వేష్.
కేంద్ర వర్కింగ్ కమిటీ
ఎంవి గోవిందమాస్టార్, ఎన్.ఆర్.బాలన్, ఎన్.చంద్రన్, ఎ.నాగప్పన్, పి.కె.బిజు, కె.కోమల కుమారి, సి.బి.దేవదర్శనన్, లలితాబాలన్, అంబిక, ఎ.డి.కున్నచ్చన్, అమియాపాత్ర, తుషార్‌ఘోష్, మిజనూర్ రహమాన్, సుకుమార్ చక్రవర్తి, రామకృష్ణరారుచౌదరి, హిమాన్షుదాస్, బొని యాతుడు, నిరపడ సర్థార్, జి.నాగయ్య, ఆర్.వెంక టరాములు, బి.ప్రసాదు, బి.పద్మ, పి.వెంటకేశ్వర్లు, ఐలయ్య, వెంకటేశ్వర్లు, సుబ్బారావు, శివనాగరాణి, లాజర్ అమర్తలింగం, చిన్నదురై, పళనిస్వామి, పుంగత్తరు, భానూలాల్ సాహా, శ్యామల్దే, భూప్‌చంద్ చన్ను, రామ్సింగ్చ గుర్మేష్సింగ్, పుట్టమధు, చంద్రప్ప హౌస్కెర, మునివెంకటప్ప, భోలాప్రసాదు దివాకర్.ధర్మేంద్ర చౌరాసియా, రామ్శ్రే మహతో, బ్రిజ్‌లాల్ భారతి, సతీస్‌కుమార్, నీతూసాల్వే, సరిత శర్మ, రామ్‌రతన్ బగారియా, ప్రేమ్ కుమార్, నిర్మల్ నాయక్, రాంబాబు జాదవ్, ఎ.విజయరాఘవన్, బి.వెంకట్, విక్రమ్సింగ్చ వి,.శివదాసన్, బాబూమోహన్
తెలంగాణా నుంచి
జి.నాగయ్య, ఆర్.వెంకటరాములు, బి.ప్రసాదు, బి.పద్మ, పొన్నం వెంకటేశ్వర్లు, ఐలయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, కె.జగన్, పెద్ది వెంకటేశ్వర్లు, ఎ.వెంకటరాజమ్, డి.సరోజ, ఎం.ఆంజనేయులు, ఎ.వీరన్న, కె.నరసింహులు, ఎం.రాములు ఉన్నారు.
ఆఫీసు బేరర్స్
ఎ.విజయరాఘవన్, బి,వెంకట్, గోవిందన్మాస్టార్, అమియపాత్ర, భానూలాల్ సాహా, లాజర్, జి.నాగయ్య, కె.కోమలకుమారి, భూప్‌చంద్ చన్నూ, విక్రమ్‌సింగ్, వి.శివదాసన్, తుషార్‌ఘోష్, వి.వెంకటేశ్వర్లు, బ్రిజ్‌లాల్ భారతి, ఎన్.చంద్రన్ ఉన్నారు.
ప్రతి కుటుంబాన్ని కదిలించాలి
- వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
- చలో పార్లమెంట్ విజయవంతం చేయాలి
ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను కదలించాలని, గ్రామస్థాయిలో సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని, అలాగే కేంద్రానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 5న నిర్వహిస్తున్న చలో పార్లమెంటును విజయవంతం చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ తెలిపారు. హౌరాలోని శరత్సదన్ (జ్యోతిబసునగర్లో) జరుగుతున్న అఖిల వ్యవసాయ కార్మిక సంఘం 10వ మహాసభలో ఆయన మాట్లాడారు. కేంద్ర విధానాలపై ప్రతిఘటన రాకపోతే ప్రజావ్యతిరేక విధానాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు. వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి రైతుల నడ్డి విరిచారని, కార్మిక చట్టాలు తీసుకొచ్చి కార్మికులను అణగదొక్కారని, ఉపాధి హామీని తగ్గించి వ్యవసాయ కార్మికులకు అన్యాయం చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో చేపట్టిన చలో పార్లమెంటును కార్యక్రమాన్ని విజయంతం చేయడం ద్వారానే హక్కులను కాపాడు కోవచ్చని తెలిపారు. ఉపాధి హామీని నిర్వీర్యం వెనుక బిజెపి కుట్రపూరిత వైఖరి ఉందని పేర్కొన్నారు. చలో పార్లమెంటు కార్యక్రమం ఉంటే ఒక ప్రదర్శనే కాదని, మొత్తం ప్రజల్లోకి ప్రభుత్వ విధానాలను తీసుకెళ్లడం ప్రధానమని చెప్పారు.