Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారతీయ సమాజానికి మాయని మచ్చ
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువ
- రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న కేంద్రం
హౌరా నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
దేేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దళితులపై దాడులు పెరిగాయనీ, ఇలాంటి దాడులు భారతీయ సమాజానికి మాయని మచ్చని, రాజ్యాంగ ఉల్లంఘనని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం 10వ మహాసభ తీర్మానించింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అలాగే కార్పొరేట్ అనుకూల మతతత్వ విధానాలతో దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయని వారి హక్కులు హరిస్తున్నారనీ, ఫలితంగా జీవనోపాధికి దూరమవుతున్నారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగమైన బీజేపీ దాని మనుస్మృతిని అమలు చేసే పనిలో వేగంగా ముందుకు వెళుతోందని వివరించారు. లింగ, కుల అణచివేతతోపాటు శ్రామికప్రజల హక్కులనూ కాలరాస్తోందని పేర్కొన్నారు. వారి చట్టాలను ఉల్లంఘిస్తూ నిరంతరం ముందుకు సాగుతున్నదని, ఉదారవాద విధానాలు, సామ్రాజ్యవాద విధానాలు, ప్రైవేటీకరణ, ఆరోగ్య రంగాన్ని విస్మరించడం వంటి చర్యలతో దళితులపై నిరంతరం దాడి కొనసాగిస్తోందని చెప్పారు. మతోన్మాద రాజకీయాలను బీజేపీ నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో నివేదికల ప్రకారం హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, రాజస్థాన్, తెలంగాణా, ఉత్తరప్రదేశ్లో దాడులు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. 2020లో ఉత్తరప్రదేశ్లో దళితులపై దాడులకు సంబంధించి 12714 కేసులు నమోదయ్యాయనీ, వాటిల్లో 3955 మందికి మాత్రమే శిక్షలు పడ్డాయని తెలిపారు. తెలంగాణాలో అదే సంవత్సరం 1959 కేసులు నమోదయితే 25 మందికి మాత్రమే శిక్షలు పడ్డాయని తీర్మానంలో పేర్కొన్నారు. హర్యానాలో 1210 కేసులకు 12 మందికి, జార్ఖండ్లో 666 కేసుల్లో 15 మందికి, మధ్యప్రదేశ్లో 6899 కేసుల్లో 791, మహారాష్ట్రలో 2569కి 67 మందికి, ఒడిస్సాలో 2046 కేసుల్లో ఐదుగురికి, రాజస్థాన్లో 7017 కేసుల్లో 886 మందికి మాత్రమే శిక్షలు పడ్డాయని వివరించారు. కేసులు, అసమానతల మధ్య చాలా తేడా ఉందని తెలిపారు. ఇది దాడులు చేసినా శిక్షలు పడవనే భావనను కల్పిస్తాయని, ఇది దాడులు పెంచేందుకు ఉపయోగపడుతుందే తప్ప తగ్గించడానికి కాదని పేర్కొన్నారు. నిశితంగా పరిశీలిస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఈ దాడులు ఎక్కువగా ఉన్నాయని, ఆయా రాష్ట్రాల్లో 2015లో 38,613 కేసులు ఉంటే 2020 నాటికి 50202 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితులు ఎలా ఉన్నా యో అర్థం చేసుకోవచ్చన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్లో ఇలాంటి దారుణాలు కొనసాగుతూనే ఉంటాయని, బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. ఉద్యమ ంలో బాధితులను కులపుకుని ముందుకు సాగాలని మహాసభ తీర్మానించింది.